: హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట
ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎంపై తానెలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై పిటిషన్ వేశారంటూ ఈ రోజు రేవంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ఉన్నత న్యాయస్ధానం, ఈ విషయంలో నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక విచారణలో రేవంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.