: అధికారుల నిర్లక్ష్యం... మరో రాజధాని ఎక్స్ ప్రెస్ బోగీలకు అంటుకున్న మంటలు


ఢిల్లీ రైల్వే స్టేషనులో ఒడిశాకు తిరిగే రాజధాని ఎక్స్ ప్రెస్ ను బుగ్గిచేసిన మంటలు పక్కనే ఉన్న మరో రాజధాని ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలనూ తాకాయి. పశ్చిమ బెంగాల్లోని సెల్డా - న్యూఢిల్లీ మధ్య తిరిగే రాజధాని ఎక్స్ ప్రెస్ పక్కనే ఉండడంతో ప్యాంట్రీ కారుతో పాటు మూడు బోగీలు తగలబడ్డాయి. వాషింగ్ ఏరియాలో ఉన్న భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోగా, 16 ఫైర్ ఇంజన్లు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మంటలు ఉన్నాయని తెలిసినా పక్కనే ఉన్న మరో రైలు బోగీలను అక్కడి నుంచి తరలించడంలో అధికారులు అలసత్వం చూపిన కారణంగానే రెండో రైలుకు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. ఈ రైలు కూడా ఖాళీగా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు.

  • Loading...

More Telugu News