: నేనేమీ ఏడవలేదు... ఎవరు చూశారు?: మీడియాకు కేంద్రమంత్రి ఎదురు ప్రశ్న


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, ఆపై నిన్న విచారం వ్యక్తం చేసిన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాపై నిప్పులు చెరిగారు. రెండు రోజుల క్రితం గిరిరాజ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారని, ఆయన గట్టిగా మందలిస్తే కన్నీరు పెట్టాడని మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, "నేనేమీ పీఎంతో సమావేశం కాలేదు. అసలు ఎవరు చెప్పారు, నేను ఏడ్చానని? ఎవరు చూశారు?" అని విరుచుకుపడ్డారు. సోనియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, నల్ల జాతీయులతో పోల్చినందుకు ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. "నేను ఎవరినీ కించపరచాలని భావించలేదు. నా కామెంట్లు ఎవరినైనా బాధపెట్టివుంటే, దానికి చింతిస్తున్నా" అని గిరిరాజ్ పార్లమెంటులో అన్నారు.

  • Loading...

More Telugu News