: న్యూఢిల్లీలో తగులబడ్డ రాజధాని ఎక్స్ ప్రెస్


న్యూఢిల్లీ రైల్వే స్టేషనులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య తిరిగే రాజధాని ఎక్స్ ప్రెస్ ఆగివున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదంలో రైలుకు చెందిన 6 ఏసీ బోగీలు పూర్తిగా మాడిమసైపోయాయి. 16కి పైగా ఫైరింజన్లు సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఏసీ బోగీలను శుభ్రపరుస్తున్న వేళ జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగసిపడ్డట్టు అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఇతర రైళ్లు రాకుండా సిగ్నలింగ్ వ్యవస్థను మార్చినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News