: కథా రచయిత కాళీపట్నంకు 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'


ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుకు ఈ ఏడాది 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'ను ప్రకటించారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందజేయనున్నారు. దాంతోపాటు రూ.లక్ష నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన కాళీపట్నం సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. 1966లో ఆయన రాసిన 'యజ్ఞం' కథ ఎంతో పేరు తెచ్చింది. దానికిగానూ 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన్నందరూ 'కారా' మాస్టారు అని పిలుస్తుంటారు. శ్రీకాకుళంలో పుట్టిన కాళీపట్నం ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటున్నారు. కథానిలయంను ప్రారంభించి అందులో రెండువేలకు పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన 2,000 పుస్తకాలను ఉంచారు.

  • Loading...

More Telugu News