: రాజకీయాల్లో చేరమని మోదీ అడిగారు... ఆలోచించి చెబుతానన్నా: మంచు మనోజ్


రాజకీయాల్లోకి వచ్చి సేవలందించాలని ప్రధాని మోదీ కోరినట్టు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ అన్నారు. ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో నరేంద్ర మోదీని మోహన్ బాబు కుటుంబం కలిసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వీరి రాక వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అని మీడియా ప్రశ్నించగా, "రాజకీయాల్లోకి వచ్చి చేరమని నన్ను అడిగారు. నేను ఆలోచించి చెబుతాను అన్నాను" అని ఆ వెంటనే ఓ నవ్వు నవ్వి "ఇట్స్ జస్ట్ జోకింగ్ అండీ" అంటూ, "ఆయనో గొప్ప నేత. మేం కలవగానే సాదరంగా ఆహ్వానించారు. బాగా మాట్లాడారు. వెడ్డింగ్ కార్డును చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు" అని మనోజ్ తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ, తన సోదరుడు మనోజ్ వివాహం మే 20న జరగనున్న నేపథ్యంలో మోదీని ఆహ్వానించేందుకు వచ్చామని అన్నారు. వీలైతే తప్పకుండా వస్తానని మోదీ తెలిపారని, ఆ సమయంలో చైనా పర్యటన ఉన్నట్టు తెలిసిందని వివరించారు. మోహన్ బాబు మాట్లాడుతూ, ఇక్కడి తెలుగు మీడియాను చూసి తనకెంతో ఆనందంగా ఉందని, మోదీ గొప్ప లీడర్ అని అన్నారు.

  • Loading...

More Telugu News