: సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మే 6న తుది తీర్పు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో తుది తీర్పు వెల్లడించేందుకు ముంబయి సెషన్స్ కోర్టు తేదీ నిర్ణయించింది. మే 6న ఈ కేసులో తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపింది. ఈ కేసులో డిఫెన్స్, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదుల తుది వాదనలు నిన్న (సోమవారం) ముగిశాయి. సల్మాన్ దోషిగా తేలితే దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28, 2002లో ముంబయిలోని సబర్బన్ బాంద్రాలో అర్ధరాత్రి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ నడుపుతున్న టయోటా లాండ్ క్రూజర్ కారు వెళ్లడంతో ఒకరు చనిపోగా, నలుగురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News