: భారీ ఫంక్షన్ల నిర్వహణలో టీఎస్సార్ తర్వాతే ఎవరైనా: చిరు


పలు రాష్ట్రాల చిత్ర పరిశ్రమల నుంచి స్టార్లను తీసుకుని వచ్చి భారీ స్థాయిలో ఫంక్షన్లను నిర్వహించడం ఒక్క టి. సుబ్బరామిరెడ్డికే చెల్లిందని కేంద్ర మంత్రి చిరంజీవి కితాబిచ్చారు. సినిమాలు, రాజకీయాలు, క్రీడలు, ఆధ్మాత్మికం.. ఇలా అన్ని రంగాల్లో సేవలందిస్తూ కళాబంధు బిరుదుకు టీఎస్సార్ న్యాయం చేకూరుస్తున్నారని చిరంజీవి కొనియాడారు. కాగా, ఢిల్లీలో అత్యాచారానికి గురైన చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాల పాటు ప్రార్థించాలని చిరు ఇచ్చిన పిలుపునకు సభికులు స్పందించారు. టీఎస్సార్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News