: ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో గల్లా జయదేవ్ కు ఊరట
ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో ఎంపీ గల్లా జయదేవ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరన్న విషయంలో ఇరు వర్గాల వాదనలు విని, అధ్యక్షుడు ఎవరో తేల్చి చెప్పాలని సింగిల్ జడ్జి బెంచ్ కు సూచించింది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఐవోఏ నుంచి 72 గంటల్లోగా ఉత్తర్వులు తెచ్చుకోవాలని గల్లాకు ఆదేశించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకూ జయదేవే అధ్యక్షుడిగా కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తానే ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడినని, గల్లా ఎన్నిక చెల్లదంటూ ఎంపీ సీఎం రమేష్ చెబుతున్నారు. ఈ నెల 19న జరిగిన ఐఓఏ ఎన్నికలో రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ మొదట్లోనే ఏకగ్రీవంగా ఎన్నికైన జయదేవ్ తాజాగా కోర్టుకు వెళ్లారు.