: ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం... దర్శనానికి బారులు తీరిన భక్తులు
విశాఖ జిల్లా సింహాచలం కొండపై ఉన్న సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనిమిస్తున్నారు. అప్పన్న ఈ ఏడాదంతా చందనంతో దర్శనమివనున్నారు. చందనోత్సవం సందర్భంగా అప్పన్న నిజ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కిలో మీటర్ల మేర బారులు తీరారు. ఓ వైపు ఎండ తీవ్రతను తట్టుకోలేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత క్యూలైన్లలో తొక్కిసలాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సింహాద్రికి వీఐపీల తాకిడి పెరగడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు స్వామివారికి మొదట ఆలయ అనువంశిక ధర్మకర్త అనంద గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీటీడీ తరపున ఈవో సాంబశివరావులు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.