: నాకెందుకీ క్యాబినెట్ ర్యాంక్!: తిరస్కరించిన రాందేవ్ బాబా
హర్యానా ప్రభుత్వం తనకిచ్చిన క్యాబినెట్ ర్యాంకును యోగా గురు రాందేవ్ బాబా తిరస్కరించారు. యోగా, ఆయుర్వేదాలను ప్రమోట్ చేస్తూ, రాష్ట్ర అంబాసిడర్ గా ఉన్న ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ, ఇటీవల హర్యానా సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాందేవ్ కు క్యాబినెట్ హోదా, బుగ్గ కారు సౌకర్యం విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కు తగ్గిన రాందేవ్ తనకిచ్చిన హోదాను తిరస్కరిస్తున్నట్టు ఈ ఉదయం ప్రకటించారు. తనను గుర్తించినందుకు హర్యానా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.