: ఆప్ నుంచి యోగేంద్ర, భూషణ్ ఔట్... బహిష్కరించిన పార్టీ అధిష్ఠానం
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యుడైన ప్రశాంత్ భూషణ్ ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. భూషణ్ తో పాటు ఆ పార్టీ కీలక నేత యోగేంద్ర యాదవ్ ను కూడా బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందునే వారిద్దరిపై తప్పనిసరి పరిస్థితుల్లో వేటు వేయాల్సి వచ్చిందని పేర్కొంది. మొన్నటి ఢిల్లీ ఎన్నికల నాటి నుంచి యాదవ్, భూషణ్ లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తూ అసమ్మతి నేతలుగా ముద్రపడ్డారు. మొన్నటికి మొన్న పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి ఈ ఇద్దరిని తప్పించిన పార్టీ, తాజాగా వారిపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది.