: కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు... ఏపీ మంత్రి నారాయణపై నాయిని వ్యాఖ్య
తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియా ప్రతినిధులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సామాన్య ఆంధ్రా ప్రజలతో తమకెలాంటి ఇబ్బంది లేదని నాయిని చెప్పగా... మరి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెళ్లగొడతామని ఎందుకన్నారంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా గొంతు సవరించుకున్న నాయిని ‘‘అట్లెవరన్నరు? వారెవ్వా... వస్తాద్ ఏం ఉన్నవ్. నారాయణ (ఏపీ మంత్రి) ఇక్కడ కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నడు. రేపు తెలంగాణ వాళ్లు కాలేజీలు పెట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేసినా నియంత్రిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.