: తమిళనాడులో ‘ఏపీ’ బస్సుపై దాడి, విద్యార్థినికి గాయాలు!
శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళ తంబీల కోపం ఇంకా చల్లారలేదు. తమ రాష్ట్రానికి చెందిన అమాయక కూలీలను ఏపీ పోలీసులు పొట్టనబెట్టుకున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులపైనే కాక ఏపీకి చెందిన పలు వాణిజ్య సముదాయాలపైనా దాడులకు తెగబడ్డారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సుపై తమిళులు దాడి చేశారు. పన్నంగాడు సమీపంలో పొన్నేరి మండలం టచ్చూరు కూట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుపై తమిళులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులోని ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆరంబకం, ఎలత్తూరు మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.