: కేసీఆర్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: ఎర్రబెల్లి
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... కేసీఆర్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని, అది ఆయన వల్ల కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఊట చెరువు వంటిదైతే, టీఆర్ఎస్ పార్టీ కేవలం గంగాళం వంటిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అధికార పక్షం ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు.