: ఏ ఫర్ తబలా... బి ఫర్ చాక్లెట్... సి ఫర్ సిగరెట్... ఆశ్చర్యపోయిన పోలీసులు


ఎర్రచందనం స్మగర్లపై దాడులు, అరెస్టుల సందర్భంగా పోలీసులు సెల్ ఫోన్లు, పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ముఠాలు కోడ్ భాషలో దందా కొనసాగిస్తున్నాయని అర్థం చేసుకున్నారు. దుంగల నాణ్యతను బట్టి వాటిని గ్రేడ్లుగా విభజిస్తారని, ఒక్కో గ్రేడ్ ను ఒక్కో సంకేత నామంతో పేర్కొంటారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. విదేశీ ఆర్డర్లను బట్టి ఈ కోడ్ లు ఉంటాయి. ఏ గ్రేడ్ దుంగలకు తబలా అని, బి గ్రేడ్ దుంగలకు చాక్లెట్ అని, సి గ్రేడ్ దుంగలకు సిగరెట్ అని సంకేత నామాలతో పిలుచుకుంటారట. వీటిని అటవీ ప్రాంతాల నుంచి నీరు, పెట్రోలు ట్యాంకర్లు, అంబులెన్సుల్లో తరలించి, నౌకల్లో దేశం దాటిస్తారు. వీటికి చైనా, జపాన్, మయన్మార్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ అని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News