: తల్లికి భయపడి ల్యాప్ టాప్ పగులగొట్టిన కుర్రాడికి కొత్త ల్యాప్ టాప్ అందించనున్న పోర్న్ సైట్
యూకేలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. యవ్వనంలో ఉన్న డెంజెల్ మైకేల్ అనే కుర్రాడికి పోర్న్ చిత్రాలు చూడడం వ్యసనంగా మారింది. అలవాటుగా ఓ రోజు పోర్న్ సైట్లో విహరిస్తుండగా, మేడపైకి తల్లి వస్తున్నట్టు గుర్తించాడు. తల్లి మెట్లెక్కి వేగంగా వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక ల్యాప్ టాప్ ను పగలగొట్టేశాడు. తాను పోర్నోగ్రఫీ వీక్షిస్తున్న విషయం తల్లికి తెలిస్తే ఆమె ఆగ్రహిస్తుందని భయపడి, ఆపేందుకు సమయం లేక, డెంజెల్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విపరీత చర్యకు దిగాడు. ఆ సమయంలో అతగాడు పోర్న్ హబ్ అనే అశ్లీల వెబ్ సైట్లో వీడియోలు చూస్తున్నాడట. కాగా, పగిలిపోయిన తన ల్యాప్ టాప్ ను ఫోటో తీసి, దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసి దాని కింద క్యాప్షన్ పెట్టాడు. "అమ్మ చకాచకా మెట్లెక్కి వస్తోంది, ఏం చేయను? వేరే మార్గంలేదు" అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన పోర్న్ హబ్ యాజమాన్యం తమ సైట్ కు వీరాభిమాని అయిన ఆ కుర్రాడిని అసంతృప్తికి గురిచేయరాదని నిశ్చయించుకుని ఓ కొత్త ల్యాప్ టాప్ ను గిఫ్టుగా పంపాలని నిర్ణయించింది. పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్ మాట్లాడుతూ... పోర్న్ హబ్ పట్ల డెంజెల్ చూపిస్తున్న అభిమానం తమను ఆకట్టుకుందని తెలిపాడు.