: సోనియా పుత్రోత్సాహం!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో నేడు ఆవేశపూరిత ప్రసంగం చేయడం మీడియాలో హైలైట్ అయింది. దీనిపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ బాగా మాట్లాడాడని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అయితే సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రాహుల్ ప్రసంగాన్ని తాను పూర్తిగా వినలేదని, బాగా మాట్లాడాడని పార్టీ నేతలు చెప్పారని ఆమె పేర్కొన్నారు. రైతుల సమస్యలు ఎత్తిచూపాడంటూ రాహుల్ ను అందరూ మెచ్చుకోవడం తనకు ఆనందం కలిగిస్తోందని తల్లి మనసు ప్రదర్శించారు. కాగా, సోనియా సహా మరో 15 మంది కాంగ్రెస్ ఎంపీలు నేడు సభకు గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News