: రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా


ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడడంతో అతడికి రూ.12 లక్షల జరిమానా వడ్డించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ నియమావళి అనుసరించి, తొలి తప్పిదంగా భావించి రోహిత్ కు ఈ జరిమానా విధించినట్టు లీగ్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News