: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి దుర్మరణం
కర్నూలు జిల్లాలో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం ఎన్.రాచర్ల వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో, పక్కనే ఉన్న లోయలో ట్రాక్టర్ పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ లో ఉన్నవారిలో కూలీలు ఎక్కువమంది ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. మరణించిన వ్యక్తులను బనగానపల్లె మండలం మీరాపురం గ్రామవాసులుగా గుర్తించారు.