: కేసీఆర్ మరోసారి... టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించగా, ఆరుగురు మంత్రి వర్గ సభ్యులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. ఈ ఎన్నికల ప్రక్రియకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షకుడిగా వ్యహరించారు. ఆయనే ఈ వివరాలు తెలియజేశారు.