: ఫేస్ బుక్ ఎక్కుతున్న అమ్మాయిల ఆరో సెల్ఫీ, అబ్బాయిల నాలుగో సెల్ఫీ


నేటి తరం యువతకు ఫేస్ బుక్ గురించి, సెల్ఫీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతిలోని కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడం ఎంత సాధారణమో, వాటిని అప్ లోడ్ చేసి ఎన్ని లైక్ లు వచ్చాయో లెక్కిస్తూ కూర్చోవడమూ అంతే సాధారణం. అబ్బాయిలు, అమ్మాయిల ఫేస్ బుక్ సెల్ఫీలపై లండన్ లో ఒక ఆసక్తికర సర్వే జరిగింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం, అమ్మాయిలు తాము తీసుకున్న తొలి ఐదు సెల్ఫీలనూ డిలీట్ చేసి ఆరో సెల్ఫీని పోస్ట్ చేస్తున్నారట. అదే అబ్బాయిల విషయంలో అయితే, నాలుగో సెల్ఫీకే తృప్తిపడిపోతున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ వన్ పోల్ ఈ సర్వే నిర్వహించింది. సెల్ఫీలను ఎంచుకునేముందు 64 శాతం మంది యువతులు భావోద్వేగాలకు లోనవుతున్నారట. 8 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది మహిళలు, 2 వేల మంది పురుషులు, వెయ్యిమంది పిల్లలను ఈ సర్వేలో భాగం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ తమ సెల్ఫీలు చూసుకున్న తరువాత మహిళల్లో 41 శాతం మంది, పురుషుల్లో 26 శాతం మంది ఆ ఫొటోలు బాగాలేవని భావిస్తుంటారట. చిన్న పిల్లల్లో మాత్రం 79 శాతం మంది అవి బ్రహ్మాండంగా ఉన్నాయని సంబరపడుతుంటారని సర్వే వివరాలు వెల్లడించాయి. ఇక తమ పిల్లల చిత్రాలను పోస్ట్ చేసే ముందు వాటిని ఏదో రకంగా ఎడిట్ చేస్తున్నట్టు తెలిపిన వారి సంఖ్యా అధికంగానే ఉంది.

  • Loading...

More Telugu News