: టాలీవుడ్ డీటీఎస్ ఇంజినీర్ మధుసూదన్ రెడ్డి హఠాన్మరణం


టాలీవుడ్ సీనియర్ సౌండ్ ఇంజినీర్ మధుసూదన్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 50 ఏళ్లు. మధుసూదన్ రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రామానాయుడు, శబ్దాలయ స్టూడియోల్లో డీటీఎస్ స్పెషలిస్ట్ గా పనిచేశారు. ఆయన నైపుణ్యానికి గుర్తింపుగా పలు నంది అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. అరుంధతి, ఒక్కడు చిత్రాలకు గాను ఆయన నంది పురస్కారం అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు డీటీఎస్ పరిచయమయ్యాక సౌండ్ ఇంజినీర్ మధుసూదన్ రెడ్డి పేరు వ్యాప్తిలోకొచ్చింది. ఇండస్ట్రీలో ఆయనను అందరూ డీటీఎస్ మధు అని పిలిచేవారు.

  • Loading...

More Telugu News