: ఇన్ఫోసిస్ పడిపోతుందట... అదే దారిలో విప్రో, హెచ్ సీఎల్ కూడా!


గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫీ నికర లాభం 2.7 శాతం పడిపోయి రూ. 3,161.5 కోట్లకు చేరవచ్చని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు. విప్రో, హెచ్ సీఎల్ తదితర కంపెనీలు కూడా అదే దారిలో నడుస్తాయని భావిస్తున్నారు. ఇన్ఫీ ఫలితాలు శుక్రవారం నాడు, హెచ్ సీఎల్ ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. దేశంలోని ఐదు ప్రముఖ బ్రోకరేజి సంస్థల అంచనాల సరాసరి ప్రకారం ఇన్ఫీ నికర అమ్మకాలు 0.3 శాతం పెరిగి రూ. 13,838 కోట్లకు చేరనున్నాయి. విప్రో ఆదాయం 0.1 శాతం పడిపోయి రూ. 11,986.20 కోట్ల రూపాయలకు, నికర లాభం 2.9 శాతం తగ్గి రూ. 2,139 కోట్లకూ చేరవచ్చని, ఇక హెచ్ సీఎల్ టెక్ ఆదాయం 1 శాతం తగ్గి రూ. 9,377.90 కోట్లకు, నెట్ ప్రాఫిట్ 3.1 శాతం పడిపోయి రూ. 1,856.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు. కాగా, నేటి మార్కెట్ సెషన్లో ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ 3 శాతానికి పైగా దిగజారింది.

  • Loading...

More Telugu News