: ఉన్నతాధికారులు రూ. 5 వేలు దాటిన గిఫ్ట్ తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఇకపై రూ. 5 వేల రూపాయలకన్నా విలువైన బహుమతిని తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. బహుమతుల విలువ రూ. 25 వేలకు మించి వుంటే, వాటన్నిటి వివరాలతో కూడిన నివేదికలను ఇస్తుండాలని ఆదేశించింది. మరింత పారదర్శకత కోసమే నిబంధనలు మార్చినట్టు అధికారులు తెలిపారు. మారిన నిబంధనలను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ తెలియజేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సూచించింది. ప్రస్తుతం ఇండియాలో సేవలందిస్తున్న 4,802 మంది ఐఏఎస్, 3,798 ఐపీఎస్, 2,668 ఐఎఫ్ఓఎస్ అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.