: సీఎం కేసీఆర్ ను కలసిన 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 'మా' అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు కలిశారు. నిన్న (ఆదివారం) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సీఎం కేసీఆర్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడి సీఎం శాలువా కప్పి సన్మానించారు. త్వరలో సినీరంగ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రిని కోరారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో నటి జయసుధపై రాజేంద్రప్రసాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News