: చంద్రబాబుకు ఫోన్ చేసిన కేసీఆర్... ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్ష!
‘ఇద్దరు చంద్రుల’ మధ్య మళ్లీ మాటలు కలిశాయి. రాష్ట్ర విభజన తర్వాత బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసినప్పుడంతా నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం కేసీఆర్, చంద్రబాబుకు ఫోన్ చేశారు. 65వ జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబుకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు తెలిపారు. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు.