: మరోసారి గులాబీ దళపతిగా కేసీఆర్... మరికాసేపట్లో మూడు సెట్ల నామినేషన్లు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవిని మళ్లీ కేసీఆరే చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న కేసీఆర్, ఈ దఫా కూడా పార్టీ అధ్యక్ష పగ్గాలను వేరేవారికి అప్పగించేందుకు సుముఖంగా లేరు. కేసీఆర్ తరఫున నేడు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఓ సెట్ ను కేబినెట్ మంత్రులు, మరో సెట్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు వేయనుండగా, మూడో సెట్ నామినేషన్లను పార్టీ కీలక నేతలు దాఖలు చేయనున్నారు. ఇక పార్టీ గ్రేటర్ విభాగం అధ్యక్ష ఎన్నికలు మరికాసేపట్లో పూర్తి కానున్నాయి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గ్రేటర్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.