: నాటి చిరుద్యోగి... ఇప్పుడు రూ. 500 కోట్ల విలువైన కంపెనీకి అధినేత!
సుమారు 23 సంవత్సరాల క్రితం హర్షద్ థక్కర్ ఓ చిన్న లోదుస్తుల స్టోర్లో మేనేజర్ గా తన 15 సంవత్సరాల వయసులో పనిచేశారు. ఇప్పుడతని వయస్సు 38 సంవత్సరాలు. 1999లో రూ. 4 లక్షల పెట్టుబడితో అతను ప్రారంభించిన ఆశాపురా ఇంటిమేట్స్ ఫ్యాషన్ విలువ ఇప్పుడు రూ. 500 కోట్లకు పైగా పెరిగింది. 2014లో రూ. 166.50 కోట్ల ఆదాయాన్ని, రూ. 5 కోట్లకు పైగా నికరలాభాన్ని నమోదు చేసింది. వాలంటైన్ బ్రాండ్ పేరిట చిన్నారులు, యువతీ యువకులకు అవసరమయ్యే నైట్ వేర్ దుస్తులను, లెగ్గిన్స్, స్పోర్ట్స్ వేర్ తదితరాలను ఈ సంస్థ తయారుచేసి దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తోంది. వాలెంటైన్ సీక్రెట్, వాలెంటైన్ పింక్, నైట్ అండ్ డే, ఎన్-లైన్ తదితర పేర్లతో పలురకాల వెరైటీలను అందిస్తోంది. తమ వ్యాపారంలో 60 శాతం ఆదాయం లో-దుస్తుల విభాగం నుంచే లభిస్తోందని, భవిష్యత్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని హర్షద్ అంటున్నారు.