: 'ఇంద్రవెల్లి అమరత్వం'ను గుర్తించని తెలంగాణ సర్కారు!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇంద్రవెల్లి మృతులకు గుర్తింపు లభిస్తుందని, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు కనీసం అనుమతినైనా ఇస్తారని భావించిన గిరిజనులకు నిరాశే మిగిలింది. నేటితో ఇంద్రవెల్లి కాల్పుల ఘటన జరిగి 34 సంవత్సరాలు పూర్తికాగా, ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అనుమతివ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆదివాసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ, ర్యాలీ నిర్వహించాయి. కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఈ స్థూపం వద్ద 25వ తేదీ వరకూ 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న, గిరిజనులను నక్సలైట్లుగా పేర్కొంటూ, పోలీసులు కాల్పులు జరపగా, ఎంతో మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News