: చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, గవర్నర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉదయం ఫోన్ చేసిన వారు ఆయనతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఈరోజు 65వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తన పుట్టినరోజు వేడుకలు ముగిసిన వెంటనే సీఎం అనంతపురం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడి గొల్లపల్లి జలాశయాన్ని సందర్శిస్తారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి, కుంటిమద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో బాబు పాల్గొంటారు.