: ఎన్డీఏను ఇరుకున పెట్టేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్


లోక్ సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల రెండో దశ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తొలిరోజునే భూసేకరణ ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తగిన నష్టపరిహార హక్కు, భూ సేకరణలో పారదర్శకత, పునరావాసం, పునరాశ్రయం ఆర్డినెన్స్ ప్రతిని సభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆరంభంలో మాజీ ఎంపీలు, సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ య ల మృతిపై సంతాపం తెలపనున్నారు. మే 8వ తేదీతో సమావేశాలు ముగియనున్నాయి. పలు బిల్లులపై రాజ్యసభలో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాగా, ఎస్ఎంఈ సవరణ బిల్లు ఈ నెల 20న పార్లమెంట్ ముందుకు రానుంది. రాజ్యసభ సమావేశాలు 23 నుంచి ప్రారంభంకానున్నాయి.

  • Loading...

More Telugu News