: బాలాజీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం... భీతిల్లిన ప్రయాణికులు


తిరుపతి, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్న బాలాజీ ఎక్స్ ప్రెస్ రైల్లో గత రాత్రి దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలో రైల్లోకి చొరబడ్డ దొంగలు మారణాయుధాలతో ప్రయాణికులను భయోత్పాతానికి గురి చేశారు. రైల్లోని 7, 8, 9 బోగీల్లోని ప్రయాణికులపై దాడికి దిగిన దొంగలు మహిళల మెడల్లోని 25 తులాల బంగారాన్ని దోచుకున్నారు. దోపిడీ దొంగల బీభత్సంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు రైలు గుత్తిలో ఆగగానే అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News