: బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్... బెంగళూరుపై 18 పరుగుల తేడాతో విజయం


ఐపీఎల్-8 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుస పరాజయాలతో నిరాశపరచిన ముంబై ఇండియన్స్ జట్టు, నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను 18 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(59) తో పాటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఉన్ముక్త్ చంద్(58) లిద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సెకండ్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (42) కూడా రాణించాడు. ఆ తర్వాత 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. బెంగళూరు జట్టు స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ (10) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (18) కూడా చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (41), డేవిడ్ వైస్ (47) పోరాడినా బెంగళూరుకు పరాజయం తప్పలేదు. బంతితో చెలరేగి మూడు కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్ హర్భజన్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News