: డివైడర్ ను ఢీకొన్న జాయింట్ కలెక్టర్ కారు... గాయాలపాలైన యువ ఐఏఎస్
రోడ్డు ప్రమాదంలో యువ ఐఏఎస్ అధికారి గాయపడ్డ ఘటన ఆదిలాబాదు జిల్లాలో గత రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని మామడ మండలం మొండిగుట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి సుందర్ అబ్నార్ గాయాలపాలయ్యారు. నిర్మల్ నుంచి జిల్లా కేంద్రం ఆదిలాబాదు వెళుతుండగా, జేసీ కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జేసీతో పాటు కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు జేసీని చికిత్స నిమిత్తం హైదరాబాదు తరలించారు.