: దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు... ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన ముప్పు!


ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి హైదరాబాదు బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. బస్సు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న కరకంబాడీ వద్ద నిలిపివేశాడు. ఆ తర్వాత ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ సర్వీసును ఏర్పాటు చేయాల్సిన ట్రావెల్స్ యాజమాన్యం, ఏమాత్రం స్పందించలేదు. దీంతో విసుగు చెందిన ప్రయాణికులు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో గంటల తరబడి ప్రయాణికులు నడిరోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News