: నేడు చంద్రబాబు జన్మదినం... పుట్టపర్తిలో కేక్ కట్ చేయనున్న ఏపీ సీఎం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకోనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్న ఆయన పుట్టపర్తిలో కేక్ కట్ చేయనున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి పుట్టపర్తి చేరుకునే ఆయన అక్కడ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం పుట్టపర్తి సత్యసాయి బాబా సమాధిని సందర్శించుకుంటారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న హంద్రీ-నీవా పనులను పరిశీలించనున్న ఆయన అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. మరోవైపు చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు జన్మదినాన్ని వేడుకగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News