: కేసీఆర్ కళ్లలో నీళ్లు తెప్పించిన 'పాట'
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాదులో జరుగుతున్న కళాకారుల సమ్మేళనంలో పలు విషయాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ పాట విని తాను కన్నీటి పర్యంతమయ్యానని తెలిపారు. 'చూడు చూడు... నల్లగొండ' అన్న పాట విని ఏడ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ గీతం తెలంగాణ బిడ్డల వెతలను కళ్లకు కట్టిందని వివరించారు. అందులోని సాహిత్యం అమూల్యమైనదని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో చివరకంటా నిలిచింది కళాకారులేనని అన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.