: బ్రావో ఫిఫ్టీ... రాయల్స్ టార్గెట్ 157
మిడిలార్డర్ లో డ్వేన్ బ్రావో (36 బంతుల్లో 62 నాటౌట్) దూకుడు ప్రదర్శించడంతో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ ధోనీ 31* పరుగులతో బ్రావోకు సహకరించాడు. అంతకుముందు, సూపర్ కింగ్స్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా... బ్రావో-ధోనీ జోడీ ఐదో వికెట్ కు అజేయంగా 91 పరుగులు జతచేయడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓపెనర్ స్మిత్ 40 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మెక్ కల్లమ్ 12 పరుగులకే అవుటయ్యాడు. రైనా 4, డు ప్లెసిస్ 1 పరుగు చేసి ఉసూరుమనిపించారు.