: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సత్తెనపల్లి మరుగుదొడ్లు


ఇంటింటికీ మరుగుదొడ్డి లక్ష్యంతో ఏపీ సర్కారు ముందుకువెళుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్లు నిర్మించడం ఇప్పుడు రికార్డు పుటల్లోకెక్కింది. దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ... సత్తెనపల్లి మరుగుదొడ్లు లిమ్కా బుక్ లో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ పథకంలో ఎన్జీవోలు, ప్రపంచ బ్యాంక్ తోడ్పాటును అందించాయని వివరించారు. ప్రతి ఇల్లూ మరుగుదొడ్డి కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కోడెల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News