: తాడిపత్రిలో ముగిసిన జాతీయ స్థాయి ఎడ్ల పందాలు... ఫుల్లుగా ఎంజాయ్ చేసిన జేసీ బ్రదర్స్
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో నాలుగు రోజుల పాటు వేడుకగా సాగిన జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిన్న రాత్రి ముగిశాయి. దాదాపు రూ.1 కోటి విలువైన బహుమతులను వివిధ విభాగాల కింద జేసీ బ్రదర్స్ అందజేశారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఎడ్ల పందాల్లో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారలు సందడి చేశారు. ఇక, జేసీ ప్రభాకరరెడ్డి ఈ పోటీల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. పందాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ఊగిపోయారు. పోటీలను అంగరంగవైభవంగా నిర్వహించిన నేపథ్యంలో, జేసీ దివాకరరెడ్డి కూడా సోదరుడిని మెచ్చుకున్నారట.