: ఏపీ ఒలింపిక్ అసోసియేన్ ఎన్నికలు ప్రారంభం... ఓటేసిన టీ మంత్రి జగదీశ్, ఎంపీ జితేందర్
ఓ వైపు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నిజమైన కార్యవర్గం తమదేనని గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ప్రకటించినా, సొంత పార్టీ టీడీపీ నేత సీఎం రమేశ్ నేతృత్వంలో హైదరాబాదులో అసోసియేషన్ కు ఎన్నికలు మొదలయ్యాయి. నగరంలోని బంజారా ఫంక్షన్ హాలులో జరుగుతున్న ఈ ఎన్నికలకు అందుబాటులో ఉన్న సంఘం సభ్యులంతా హాజరయ్యారు. ఓటింగ్ లో భాగంగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.