: ఢిల్లీలో కిసాన్ ర్యాలీ ప్రారంభం... హాజరైన సోనియా, మన్మోహన్, రాహుల్


బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ తలపెట్టిన కిసాన్ ర్యాలీ కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పార్టీ అగ్రనేతలు పాలుపంచుకున్న ఈ ర్యాలీ కోసం దేశం నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఢిల్లీలోని రాంలీలా మైదానం రైతుల నినాదాలతో హోరెత్తుతోంది. ఈ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నేతలు తరలివెళ్లారు.

  • Loading...

More Telugu News