: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి... పోటీ నుంచి తప్పుకున్న రామచంద్రన్ పిళ్లై!
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తెలుగు నేత సీతారాం ఏచూరి ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం బరిలో నిలిచిన కేరళ కమ్యూనిస్టు కురువృద్ధుడు రామచంద్రన్ పిళ్లై పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఈ పదవి కోసం దాఖలు చేసిన నామినేషన్ ను పిళ్లై ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నేటి మధ్యాహ్నం సీతారాం ఏచూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.