: ఫార్చూనర్లు సౌకర్యంగా లేవట... ఏపీ సీఎం కాన్వాయ్ లోకి మళ్లీ సఫారీల ఎంట్రీ!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్ లో మళ్లీ వాహనాలు మారాయి. పదేళ్ల క్రితం సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు అంబాసిడర్ కార్లనే తన కాన్వాయ్ లో వినియోగించారు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం వాహన శ్రేణిలోకి సఫారీలను తీసుకొచ్చారు. పదేళ్ల తర్వాత తిరిగి సీఎం పదవి దక్కించుకున్న చంద్రబాబు, సఫారీల స్థానంలో ఫార్చూనర్లను చేర్చారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఫార్చూనర్లకు స్వస్తి పలికిన చంద్రబాబు, తిరిగి సఫారీల వైపే మొగ్గారు. ఫార్చూనర్లు అంత సౌకర్యంగా లేవని భావించిన చంద్రబాబు, తన కాన్వాయ్ లో సఫారీలకు తిరిగి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీఎం కాన్వాయ్ కోసం కొనుగోలు చేసిన ఫార్చూనర్లను అధికారులు విజయవాడ తరలించారు. విజయవాడ పర్యటనలో చంద్రబాబు వాటిని వినియోగిస్తారట.

  • Loading...

More Telugu News