: లేటు వయసులో ఘాటు యవ్వనం... కాస్మెటిక్ సర్జరీతో మెరిసిపోతున్న పుతిన్!


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వయసు ప్రస్తుతం 62 ఏళ్లు. అయినా ఆయన మునుపటి కంటే కాస్త తక్కువ వయస్సున్న వారిలా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, గతంలో కంటే ఆయన నవ యవ్వనంతో మెరిసిపోతున్నారు. గత నెలలో ఓ పది రోజుల పాటు సెలవు తీసుకుని వెళ్లిన ఆయన ఇటీవల తిరిగివచ్చారు. సెలవు ముగించుకుని వచ్చిన ఆయనను టీవీ తెరలపై చూసిన రష్యన్లు అవాక్కయ్యారు. ఎందుకంటే, అప్పటిదాకా ఆయన ముఖంపై కనిపించిన ముడతల్లో ఏ ఒక్కటీ లేదట. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అలాగని వృద్ధాప్యం ముడతలను దాయలేరుగా. అయితే అందంగా కనిపించాలన్న యావ కాస్త ఎక్కువగా ఉన్న పుతిన్, పదిరోజుల పాటు సెలవు తీసుకుని కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారని ఆ దేశస్థులు గుసగుసలాడుతున్నారు.

  • Loading...

More Telugu News