: టిప్పు సుల్తాన్ కత్తి పిడిలో వజ్ర వైడూర్యాలు... లండన్ లో వేలానికి రాబోతోంది!


మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ వైభోగం అంతా ఇంతా కాదట. సింహాసనానికే కాక శత్రు సంహారానికి వినియోగించే కత్తి పిడిలోనూ ఆయన వజ్ర వైడూర్యాలను పొదిగించుకున్నాడట. అంతేకాదండోయ్, ఆ కత్తి బంగారు జరీతోనూ రూపొందింది. ఇక ఆయన వాడిన శిరస్త్రాణం, రక్షక కవచం, నడుము దట్టీ (బెల్టు), బాణాలు, వేట తుపాకీ తదితరాలు కూడా ఖరీదైనవే. ఈ వస్తువులన్నింటితో పాటు కోట్ల రూపాయల విలువ చేసే సదరు కత్తి ప్రస్తుతం లండన్ లో వేలానికి రాబోతోంది. 1799 లో డ్యూక్ ఆప్ వెల్లింగ్టన్ తో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఆ తర్వాత మైసూరు మహా నగరాన్ని కొల్లగొట్టిన బ్రిటిష్ పాలకులు భారీ బంగారు నిధులతో పాటు టిప్పు సుల్తాన్ వస్తువులను కూడా లండన్ తరలించారు. ఈ నెల 21న టిప్పు సుల్తాన్ కు చెందిన వస్తువులను ప్రముఖ వేలం సంస్థ బోన్ హోమ్స్ వేలం వేయబోతోంది. టిప్పు సుల్తాన్ వాడిన వస్తువులకు ఈ వేలంలో ఎంతలేదన్నా రూ.10 కోట్ల ధర వస్తుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News