: కోల్ కతా నైట్ రైడర్స్ లక్ష్యం 156


కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య పూణేలో జరుగుతున్న ఐపీఎల్ పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బెయిలీ అర్ధ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. మొత్తం 45 బంతులను ఎదుర్కొన్న బెయిలీ 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జట్టులో మాక్స్ వెల్ 33 పరుగులు చేసి రాణించారు. స్టార్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి విఫలం అయ్యాడు. 10 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 11 పరుగులతో సరిపెట్టుకున్నాడు. పంజాబ్ జట్టులో యాదవ్ 3, రసెల్ 2 వికెట్లు తీశారు. మరికాసేపట్లో 156 పరుగుల విజయలక్ష్యంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News