: రెండు బెడ్ రూంల ఇళ్లు కట్టించి తీరుతాం: వెనక్కు తగ్గేది లేదన్న కేసీఆర్


ఎన్నికలకు ముందు తామిచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా, పేదల కోసం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని అమలు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులపై భారం పడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు. జిల్లాల కలెక్టర్లతో ఆయన నేడు కూడా సమావేశం అయ్యారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ వేడుకల కోసం రూ. 20 కోట్ల నిధులు కేటాయిస్తానని వివరించారు. గోదావరి పుష్కరాలకు కూడా ఘనమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని కలెక్టర్లకు తెలిపారు.

  • Loading...

More Telugu News