: విమానాశ్రయాల మాదిరిగా రైల్వే స్టేషనులు... అమరావతి షాంఘైలా ఉంటుందట
చైనాలోని షాంఘై తరహాలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. షాంగై నగర మోడల్ ను తాను చూశానని, నిర్మాణం అద్భుతమని వివరించారు. ప్రపంచంలో ప్రముఖ నౌకాశ్రయాల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయని గుర్తుచేసిన ఆయన, 60 శాతం సెల్ ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయని, అక్కడి రైల్వే స్టేషన్ లు మన విమానాశ్రయాల మాదిరి ఉన్నాయని అన్నారు. ఇండియాతో బంధాన్ని పెంచుకునేందుకు చైనా ఉత్సాహాం చూపిస్తోందని అన్నారు. అమరావతికి ప్రపంచస్థాయి పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావాన్ని బాబు వ్యక్తం చేశారు.